విద్యాగంధం
విద్యాగంధం మౌలికంగా విద్య అంటే , తెలుసుకోవడం. వ్యక్తులకు ఉపయోగపడే సందర్భాలను పురస్కరించుకొని విద్యను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) జీవనోపాధికి ఉపయోగపడేది , 2) ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకునేది , 3) జీవిత పరమార్థాన్ని గ్రహించేది. మొదటి రకమైన విద్యను పాఠశాల , కళాశాల , విశ్వవిద్యాలయాలలో జీవనోపాధికి సరిపోయే జ్ఞానం , నైపుణ్యాల రూపేణా సంపాదించుకోవచ్చు. ఆది చదవడం , రాయడం , గణించడంతో పాటు అవగాహనా శక్తిని పెంచుతుంది. సూక్ష్మ దృష్టితో పరిశీలించడం నేర్పుతుంది. రసజ్ఞతను కలిగిస్తుంది. పదిమందితో కలిసిమెలసి తిరగడం సర్దుబాటు చేసుకోవడం అలవరుస్తుంది. విద్యలో ప్రావీణ్యం సాధిస్తే సంపదను , పదిమందిలో గౌరవాన్ని పొందవచ్చు. రెండోదైన ప్రాపంచిక జ్ఞానాన్ని ...