విద్యాగంధం

  విద్యాగంధం

మౌలికంగా విద్య అంటేతెలుసుకోవడం. వ్యక్తులకు ఉపయోగపడే సందర్భాలను పురస్కరించుకొని విద్యను మూడు రకాలుగా విభజించవచ్చు.

1)            జీవనోపాధికి ఉపయోగపడేది,

2)               ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకునేది,

3)               జీవిత పరమార్థాన్ని గ్రహించేది.

మొదటి రకమైన విద్యను పాఠశాలకళాశాలవిశ్వవిద్యాలయాలలో  జీవనోపాధికి సరిపోయే జ్ఞానంనైపుణ్యాల రూపేణా  సంపాదించుకోవచ్చు. ఆది చదవడంరాయడం,  గణించడంతో  పాటు అవగాహనా శక్తిని పెంచుతుంది. సూక్ష్మ దృష్టితో పరిశీలించడం నేర్పుతుంది. రసజ్ఞతను కలిగిస్తుంది. పదిమందితో కలిసిమెలసి తిరగడం  సర్దుబాటు చేసుకోవడం  అలవరుస్తుంది. విద్యలో ప్రావీణ్యం సాధిస్తే సంపదనుపదిమందిలో  గౌరవాన్ని పొందవచ్చు.

 

రెండోదైన ప్రాపంచిక జ్ఞానాన్ని   తెలుసుకోవడానికి- దినపత్రికలుప్రసార  మాధ్యమాలుగ్రంథాలయాలుపుస్తకాలు చాలా ఉంటాయి. మనం పొందిన జ్ఞానం వ్యక్తులనుపరిస్థి తులను,  చుట్టూ ఉండే పరిసరాలను అవగాహన చేసుకుంటూ మనల్ని మనం మలచుకుంటూ ఆనందంగా ఆర్థ వంతంగా జీవితాన్ని కొనసాగించడానికి దోహదపడాలి. అదే అందరికీ సౌహార్ధ సాంఘి జీవనానికి ఆవశ్యకం. నలుగురిలో కలిసి మెలసి తిరుగుతూ. ఉంటే ఎవరితో ఎలా  మసలుకోవాలో అర్థం అవుతుంది .

విద్యే ఆనందానికి మూలమైతేప్రతి  విద్యాధికుడూ ఆనందంగా ఉండాలి. కానీకొందరు విశ్వవిద్యాలయ  పట్టా పొంది. ఉన్నత ఉద్యోగంలో ఉన్నా సుఖంగా ఉండటం లేదు.

ఏ విద్యార్హత లేని కొంతమంది మారుమూల గ్రామాల్లోనూ చాలా  ఆనందంగా గడుపుతూ కనిపిస్తుంటారు. అంటేజీవితాన్ని ఆనందమయంగా  గడపాలంటే కొంత వివేకంనేర్పు సైతం కావాలి. ఇవి అనుభవంతో గాని సాధనలోకి రావు. పెద్దలపై గౌరవంబంధుమిత్రుల పట్ల  దాక్షిణ్యంపనిచేసేవారి మీద దయసజ్జనులతో   స్నేహందుర్జనుల  విషయంలో కాఠిన్యంయజమానుల పట్ల విశ్వాసంకార్యకలాపాల్లో నీతి కలిగి ఉండటంపొరపాట్లు చేసినవారి పట్ల క్షమఅసూయాగ్రస్తులపై కేవలం ఉదాసీనత చూపడం మొదలైనవి నేర్పరులు సంతరించుకునే గుణాలు. 

  మూడోదిఆధ్యాత్మిక  విద్య. భగవంతుడి గురించి తెలియజెప్పేదే నిజమైన విద్య అంటారు. ఈ విద్యను ఉపనిషత్తులుపురాణాలుఇతిహాసాలుభగవద్గీత మొదలైన పవిత్ర గ్రంథాలను చదివిసద్గురువుల  బోధలు విని అభ్యసించవచ్చు. ఏదీ శాశ్వతం కాదనిసకల చరాచర జగత్తు పరమాత్మ స్వరూపమనితనలో ఉన్న పరమాత్మ అందరిలోనూ ఉన్నదని సమదృష్టి కలిగి ధార్మిక చింతనతో సుఖదుఃఖాలను కష్టనష్టాలను సమానంగా  చిరునవ్వుతో స్వీకరిస్తూ నైతిక జీవనాన్ని గడిపేందుకు ఉపయోగపడుతుంది.

 

విద్య మనలో నిగూఢంగా ఉన్న శక్తియుక్తులను వెలికితీసి కార్యోన్ముఖుల్ని చేస్తుంది. చదువు కేవలం అక్షర జ్ఞానమోలేక పేరు చివర తగిలించుకునే రెండో మూడో అక్షరాలతో ఉండి పొట్ట నింపుకొనే అర్హతాపత్రమో కాదు. సంస్కారం లేని విద్య పరిమళరహిత పుష్పం. అందుకనే పెద్దలు చదువుతో పాటు  సంస్కారం కావాలి అంటారు. మనిషి నిరంతర విద్యార్థివిద్య మనిషికి ప్రపంచాన్ని చదవడం నేర్పాలి. ఉచితానుచితాలు తెలియజెప్పాలి. జీవన గమ్యాన్ని సూచించి ఒడుదొడుకులను అధిగమించి లక్ష్యాన్ని చేరేలా ప్రేరణ ఇవ్వాలి. అదే నిజమైన  విద్య. 

కస్తూరి హనుమన్నా గేంద్ర ప్రసాద్

Popular posts from this blog

Maths Projects Class 10