Posts

Showing posts from July 19, 2024

సమయం... ఎంత కేటాయించాలి?

  సమయం... ఎంత కేటాయించాలి ? సమయం అందరికీ  రోజుకి  24  గంటలే . కొంతమంది అదే సమయంతో విజయం సాధిస్తే మరికొంతమంది అపజయం పొందుతున్నారు.  కారణాలు  ఏమిటి ? సమయ ప్రణాళిక పోటీ పరీక్షల అభ్యర్థులకు ఏవిధంగా ఉపకరిస్తుంది ?   ఏ పోటీ పరీక్షకి సిద్ధపడాలో నిర్ణయించుకుని ఆపై  సిలబస్‌ ,  ప్రశ్నపత్రాల పరిశీలన ,  తగిన పుస్తకాల ఎంపిక   జరిగాక సమయ సద్వినియోగ ప్రణాళికను రచించుకోవాలి.   దీన్ని పకడ్బందీగా రూపొందించుకుంటే సగం విజయం సాధించినట్లే.   ప్రిపరేషన్‌కి ఎంత సమయం పడుతుందనేది అభ్యర్థి  గ్రహణశక్తి ,  జ్ఞాపకశక్తి ,  ఏకాగ్రత  మొదలైన లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. పోటీ పరీక్ష స్థాయి ,  పోటీ పడే అభ్యర్థుల సంఖ్య ,  లభ్యమయ్యే పోస్టుల సంఖ్య మొదలైన అంశాల మీద ఆధారపడి ప్రిపరేషన్‌ సమయాన్ని నిర్థ్ధారించుకోవాలి. *  బ్యాంక్‌ క్లరికల్‌ ,  స్టాఫ్‌ సెలక్షన్‌ పరీక్షలు మొదలైనవాటికి పూర్తి స్థాయిలో చదివితే  నాలుగు నుంచి ఆరు నెలల సమయంలో  పట్టు సాధించవచ్చు.   డీఎస్సీ ,  ఎస్‌ఐ ,  పోలీస్‌ లాంటి పరీక్షకు కూడా ఆరు నెలలు పడుతుంది. గ్రూప్‌- 2  పరీక్షకు కనీసం ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు పడుతుంది.  గ్రూప్‌- 1,  యూపీఎస్సీ పరీక్షలకు పూర్తిస్