Posts

Showing posts from March 11, 2024

సాపేక్ష ప్రధాన సంఖ్యలు ( పరస్పర ప్రధాన సంఖ్యలు )

సాపేక్ష ప్రధాన సంఖ్యలు ( పరస్పర ప్రధాన సంఖ్యలు ) :- రెండు సంఖ్యలకు ‘ 1’ తప్ప వేరే సామాన్య కారణాంకాలు ఏవి లేనట్లయితే అట్టి సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు ( పరస్పర ప్రధాన సంఖ్యలు ) అంటారు ఏవేని రెండు సంఖ్యల గ. స. భా 1 అయిన అట్టి సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు ( పరస్పర ప్రధాన సంఖ్యలు ) అంటారు ఉదా : (5,7 ) (10,3), (7,9) ఏవేని రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయినంత మాత్రాన అవి ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు . కాని రెండు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అయిన అవి పరస్పర ప్రధాన సంఖ్యలు అగును. రెండు సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అయినప్పుడు కూడా అవి పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యే అవకాశం ఉంది ఉదా 4, 15 లు సంయుక్త సంఖ్యలు వాటి ఉమ్మడి కారణాంకం 1 కావున అవి పరస్పర ప్రధాన సంఖ్యలు

Prime Numbers ప్రధాన సంఖ్యలు

ప్రధాన సంఖ్యలు : - (Prime numbers ) ఒక సంఖ్యకు రెండు కారణాంకాలు మాత్రమె ఉంటె అ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు . ఒక సహజ సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య తప్ప వేరే ఇతర కారణాంకాలు లేకుంటే అట్టి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు లేదా ప్రధానాంకాలు అంటారు. 100 లోపు ప్రధాన సంఖ్యలు∶- 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97 సంయుక్త సంఖ్యలు:- (Composite Numbers) ఒక సంఖ్యకు మూడు లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉంటె అ సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు ఒక సహజ సంఖ్యకు 1 మరియు అదే సంఖ్యతో పాటు కనీసం మరో కారణాంకం ఉంటె అట్టి సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. గ్రీకు గణిత శాస్రవేత్త ఎరటోస్తనీస్ ప్రధాన సంఖ్యలను గుర్తించుటకు “ఎరటోస్తనీస్ జల్లెడ “ అనే పద్ధతిని కనిపెట్టాడు దీనిలో వృత్తాకారంలో చుట్టబడినవన్నీ ప్రధానసంఖ్యలే 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ....25 2,3,5,7,11,13,17,19,23,29,31,37,41,43,47,53,59,61,67,71,73,79,83,89,97 1 నుండి 50 వరకు గల ప్రధానసంఖ్యలు .... 15 1 నుండి 100 వరకు గల సంయుక్త సంఖ్యలు …