Posts

Showing posts from July 22, 2024

విద్యాగంధం

    విద్యాగంధం మౌలికంగా విద్య అంటే ,  తెలుసుకోవడం. వ్యక్తులకు ఉపయోగపడే సందర్భాలను పురస్కరించుకొని విద్యను మూడు రకాలుగా విభజించవచ్చు. 1)              జీవనోపాధికి ఉపయోగపడేది , 2)                 ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకునేది , 3)                 జీవిత పరమార్థాన్ని గ్రహించేది. మొదటి రకమైన విద్యను పాఠశాల ,  కళాశాల ,  విశ్వవిద్యాలయాలలో  జీవనోపాధికి సరిపోయే జ్ఞానం ,  నైపుణ్యాల రూపేణా  సంపాదించుకోవచ్చు. ఆది చదవడం ,  రాయడం ,   గణించడంతో  పాటు అవగాహనా శక్తిని పెంచుతుంది. సూక్ష్మ దృష్టితో పరిశీలించడం నేర్పుతుంది. రసజ్ఞతను కలిగిస్తుంది. పదిమందితో కలిసిమెలసి తిరగడం  సర్దుబాటు చేసుకోవడం  అలవరుస్తుంది. విద్యలో ప్రావీణ్యం సాధిస్తే సంపదను ,  పదిమందిలో  గౌరవాన్ని పొందవచ్చు.   రెండోదైన ప్రాపంచిక జ్ఞానాన్ని   తెలుసుకోవడానికి- దినపత్రికలు ,  ప్రసార   మాధ్యమాలు ,  గ్రంథాలయాలు ,  పుస్తకాలు చాలా ఉంటాయి. మనం పొందిన జ్ఞానం వ్యక్తులను ,  పరిస్థి తులను ,   చుట్టూ ఉండే పరిసరాలను అవగాహన చేసుకుంటూ మనల్ని మనం మలచుకుంటూ ఆనందంగా ఆర్థ వంతంగా జీవితాన్ని కొనసాగించడానికి దోహదపడాలి. అదే అందరికీ సౌహార్ధ సాంఘి జీవనానికి ఆవశ