సాగరతీరం నేర్పిన జీవనపాఠం

 


                                 - శ్రీమతి సుధామూర్తి, చైర్మన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్

ఓ ఆదివారం నా బాల్యమిత్రుడు తన ఇరవయ్యేళ్ళ కొడుకును వెంటబెట్టుకొని మా ఇంటికి వచ్చాడు.  నా మిత్రుణ్ణి చూసి దాదాపు ముప్ఫైఏళ్ళయి ఉంటుంది.  కలిసి చదువుకున్న రోజులు... వాన నీటిలో ఆటలు... కాగితపు పడవలు - ఇలా ఎన్నో జ్ఞాపకాలు నా మనస్సులో మెదిలాయి. కానీ అతనెందుకో అంత ఉత్సాహంగా కనిపించ లేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన తన కొడుకును పరిచయం చేశాడు. ఆ అబ్బాయి కూడా చాలా అనాసక్తిగా వచ్చినట్లనిపించింది.

 

నేనే చొరవ తీసుకొని యథాలాపంగా ఆ అబ్బాయిని 'చదువైపోయింది కదా! ఏం చేస్తున్నావని అడిగాను. అప్పుడు అతడు ' ఏదైనా ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో చేరి, తరువాత విదేశాలకు వెళ్లామనుకుంటున్నాను. అక్కడ ప్రారంభించాలనుకుంటున్నాను' అన్నాడు. కొన్నాళ్ళుండి. తిరిగొచ్చి మీలా సొంతంగా ఓ సంస్థ

                                       నేను కాస్త ఆలోచించి, 'బాగుంది! కానీ, సంస్థను ప్రారంభించాలంటే చాలా తంటాలు పడాలి. కష్టనష్టాలు ఎదుర్కోవాలి. ఇంతా చేస్తే లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం లేదు. అప్పుడు క్రుంగిపోకుండా నిలబడగలగాలి' అన్నాను. 'అది సరే! మరి ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నావు' అని అడిగాను.

                    'ఎక్కడా పనిచేయడం లేదు. ఏదైనా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాలని చూస్తున్నా' అన్నాడు. 'మరి! ప్రోగ్రామింగ్ లో శిక్షణకానీ, అనుభవంకానీ ఉన్నాయా?' అని ప్రశ్నించాను. 'లేదు!  కానీ త్వరలో నేర్చుకుంటాను. తక్కువ జీతాలు వచ్చే చిన్న చిన్న ఉద్యోగాలు చేయదలచుకోలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగమైతేనే చేద్దామనుకుంటున్నాను' అన్నాడు. నా మిత్రుడు ఎందుకు దిగాలుగా ఉన్నాడో అప్పుడు అర్థమైంది. ఏ ఉద్యోగమూ చేయకుండా పెద్ద పెద్ద కలలు కంటున్న పుత్రరత్నమే అతనికి పెద్ద సమస్యగా మారాడని అర్థం చేసుకున్నాను. అందుకే ఆ యువకుడికి నా మనస్సులో మాట చెప్పాను. ముందు ఏదైనా ఉద్యోగంలో స్థిరపడి, ఆపైన కృషి చేయమన్నాను. కానీ ఆ అబ్బాయి ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు.

 

ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ళకు నేను మా సంస్థ కార్యక్రమాల్లో భాగంగా ఒరిస్సాలోని చండీపూర్ కు  వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ సముద్రం  ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అయిదు కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్ళిపోతుంది. కొన్ని గంటల తరువాత మళ్ళీ ఎగసిపడుతూ ముందుకు వస్తుంది.  ఇది చాలా అద్భుతమైన దృశ్యం.  అక్కడి మత్స్యకారులకు మాత్రం ఇది ఓ మంచి జీవనోపాధికి ఆసరా!  సముద్రం వెనక్కి తగ్గడం ప్రారంభించగానే,  ఇసుకలో నుంచి ఎర్రటి  పీతలు బయటకు వస్తాయి. చేపలు పట్టేవారు. వాటిని బుట్టల్లో వేసుకొని అమ్ముకుంటూ ఉంటారు.

 

ఓ రోజు ఉదయమే అలా నడుచుకుంటూ వెళుతున్న నాకు,  పన్నెండేళ్ళ జావేద్ అనే కుర్రాడు తన తల్లికి వల విసరడంలో సాయపడుతూ,  పీతలు పడుతూ కనిపించాడు. అతడు నడిచే తీరు చూస్తే చాలు - ఉ త్సాహం పొంగి పొరలుతున్నట్లు తెలిసిపోతోంది.  నన్ను చూసి పరుగెత్తుకొని వచ్చి, తాజా పీతలు అమ్మజూపాడు. 'నేను పీతలు తినను. కానీ నీతో మాట్లాడతానని చెప్పి, దూరంగా తీరంలో కూర్చున్నాం.

 

బక్కపలచగా ఉన్నా, ఆ కుర్రాడి కళ్ళు మాత్రం వజ్రాల్లా మెరిసిపోతున్నాయి.  తండ్రి రిక్షా లాగి రోజుకు రూ. 50 సంపాయిస్తాడనీ, తల్లి చేపలు పట్టి కుటుంబానికి అదనపు ఆదాయం ఆర్జించి పెడుతుందనీ ఆ అబ్బాయి చెప్పాడు. స్కూల్లో చదువుకుంటూ, తాను ఎప్పుడూ తరగతిలో ప్రథముడిగా వస్తానని ఆనందంగా చెప్పాడు. 'మరి ఇక్కడేం చేస్తున్నావు?' అని అడిగాను. 'ఉదయం సముద్రం వెనక్కి తగ్గినప్పుడు అమ్మతో కలసి పీతలు పడతాను. తరువాత ఇంటికివెళ్ళి స్నానం చేసి తరువాత బడికి వెళతాను. సాయంకాలం తిరిగి వచ్చాక త్వరగా హెూమ్ వ ర్క్ పూర్తి చేసుకొని, సాయంత్రం సముద్రతీరానికి వచ్చి మళ్ళీ పీతలు పడతాను' అన్నాడు. 'ఇంతచేస్తే నీకేమొస్తుంది జావేద్?' అని అడిగాను. '5  రూపాయలు వస్తాయి మేడమ్!' అన్నాడు. ఆనందంగా. 'అంతేనా జావేద్! దాంతో ఏమొస్తుంది? ఈ పాటి సంపాదన కోసం ఉదయం అయిదింటికే లేస్తావు, మళ్ళీ రాత్రి పదకొండుకు గానీ నిద్రపోవు' అన్నాను.

 

వెంటనే జావేద్ చిరునవ్వుతో 'ఏమీ లేని దానికన్నా ఐదు రూపాయలు ఎక్కువే కదా మేడమ్ ! ఐదు రూపాయలతో ఉప్పు కొనుక్కోవచ్చు. మిరపకాయలు కొనుక్కోవచ్చు. పనీపాటా లేకుండా కూర్చుంటే అవి కూడా కొనలేం కదా! వందలు, వేలల్లో డబ్బులు రావుకదా! రూపాయి, రూపాయి కలిస్తేనే, అంత డబ్బయ్యేది. బొట్టు బొట్టు నీరు చేరితేనే సముద్రమవుతుంది కదా మేడమ్!" అన్నాడు.

 జావేద్ జవాబుతో అబ్బురపడ్డాను. చేపలు పట్టే ఈ పేదబాలుడు వంటబట్టించుకున్న జీవన పాఠాన్ని. నగరం లోని సాఫ్ట్వేర్ యువకుడు ఎందుకు నేర్చుకోలేకపోయాడోనని ఆశ్చర్యపడ్డాను.

 ఎవరైతే ఎట్టి ప్రతిఫలాపేక్షయు లేకుండా పరులకు ఉపకారములనే చేస్తూఉంటారో వారే యోగ్యులు, ధన్యులు, పుణ్యమూర్తులు.

 విలువల విద్య- జీవన నైపుణ్యాలు

 

Popular posts from this blog

Maths Projects Class 10