Posts

సాపేక్ష ప్రధాన సంఖ్యలు ( పరస్పర ప్రధాన సంఖ్యలు )

సాపేక్ష ప్రధాన సంఖ్యలు ( పరస్పర ప్రధాన సంఖ్యలు ) :- రెండు సంఖ్యలకు ‘ 1’ తప్ప వేరే సామాన్య కారణాంకాలు ఏవి లేనట్లయితే అట్టి సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు ( పరస్పర ప్రధాన సంఖ్యలు ) అంటారు ఏవేని రెండు సంఖ్యల గ. స. భా 1 అయిన అట్టి సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు ( పరస్పర ప్రధాన సంఖ్యలు ) అంటారు ఉదా : (5,7 ) (10,3), (7,9) ఏవేని రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయినంత మాత్రాన అవి ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు . కాని రెండు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అయిన అవి పరస్పర ప్రధాన సంఖ్యలు అగును. రెండు సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అయినప్పుడు కూడా అవి పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యే అవకాశం ఉంది ఉదా 4, 15 లు సంయుక్త సంఖ్యలు వాటి ఉమ్మడి కారణాంకం 1 కావున అవి పరస్పర ప్రధాన సంఖ్యలు

Prime Numbers ప్రధాన సంఖ్యలు

ప్రధాన సంఖ్యలు : - (Prime numbers ) ఒక సంఖ్యకు రెండు కారణాంకాలు మాత్రమె ఉంటె అ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు . ఒక సహజ సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య తప్ప వేరే ఇతర కారణాంకాలు లేకుంటే అట్టి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు లేదా ప్రధానాంకాలు అంటారు. 100 లోపు ప్రధాన సంఖ్యలు∶- 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97 సంయుక్త సంఖ్యలు:- (Composite Numbers) ఒక సంఖ్యకు మూడు లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉంటె అ సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు ఒక సహజ సంఖ్యకు 1 మరియు అదే సంఖ్యతో పాటు కనీసం మరో కారణాంకం ఉంటె అట్టి సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. గ్రీకు గణిత శాస్రవేత్త ఎరటోస్తనీస్ ప్రధాన సంఖ్యలను గుర్తించుటకు “ఎరటోస్తనీస్ జల్లెడ “ అనే పద్ధతిని కనిపెట్టాడు దీనిలో వృత్తాకారంలో చుట్టబడినవన్నీ ప్రధానసంఖ్యలే 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ....25 2,3,5,7,11,13,17,19,23,29,31,37,41,43,47,53,59,61,67,71,73,79,83,89,97 1 నుండి 50 వరకు గల ప్రధానసంఖ్యలు .... 15 1 నుండి 100 వరకు గల సంయుక్త సంఖ్యలు …

సంవర్గామాన న్యాయాలు Identities of Logarithms

Image

దీర్ఘఘనం సూత్రాలు ( ఫార్ములాస్ )

Image

గ్రహానికి ఉపగ్రహానికి ఉన్న తేడా ఏమిటి? Difference

గ్రహానికి ఉపగ్రహానికి ఉన్న తేడా ఏమిటి? జవాబు: నిర్వచనము ప్రకారము సూర్యుని చుట్టూ తిరిగేవి గ్రహాలు , గ్రహాల చుట్టూ తిరిగేవి ఉపగ్రహాలు . గ్రహాలు సైజు లో పెద్దవి . ఉపగ్రహాలు సైజులో చిన్నవి . గ్రహాలకు ఉపగ్రహాలకు కూడా స్వయం ప్రకాశశక్తి లేదు . రెండూ రాతిగోళాలే . ఆ గొళాలు సూర్యుని కాంతిని పరావర్తనం చిందించి ప్రకాశస్తాయి. గ్రహాలలో కొన్నింటిమీద వాతావరణం ఉంటుంది . ఉపగ్రహాలకు వాతావరణం లేదు . వాతావరణం కలిగి సైజులో పెద్దది అయినది ... భూమి . దానిఉపగ్రహము చంద్రుడు* *🛰️మనము ప్రయోగించగా భూకక్ష్యలో పరిభ్రమించేవి కృత్రిమ ఉపగ్రహాలు . వీటిద్వారానే నేడు మన కమ్యూనికేషన్‌ వ్యవస్థ మొత్తం నడుస్తోంది.*

Real Numbers Quiz Class 10 Maths

Real Numbers Quiz 1

NTSE -1 Real Numbers వాస్తవ సంఖ్యలు 10 వ తరగతి గణితం

Image