Prime Numbers ప్రధాన సంఖ్యలు

ప్రధాన సంఖ్యలు : - (Prime numbers ) ఒక సంఖ్యకు రెండు కారణాంకాలు మాత్రమె ఉంటె అ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు . ఒక సహజ సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య తప్ప వేరే ఇతర కారణాంకాలు లేకుంటే అట్టి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు లేదా ప్రధానాంకాలు అంటారు. 100 లోపు ప్రధాన సంఖ్యలు∶- 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97 సంయుక్త సంఖ్యలు:- (Composite Numbers) ఒక సంఖ్యకు మూడు లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉంటె అ సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు ఒక సహజ సంఖ్యకు 1 మరియు అదే సంఖ్యతో పాటు కనీసం మరో కారణాంకం ఉంటె అట్టి సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. గ్రీకు గణిత శాస్రవేత్త ఎరటోస్తనీస్ ప్రధాన సంఖ్యలను గుర్తించుటకు “ఎరటోస్తనీస్ జల్లెడ “ అనే పద్ధతిని కనిపెట్టాడు దీనిలో వృత్తాకారంలో చుట్టబడినవన్నీ ప్రధానసంఖ్యలే 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ....25 2,3,5,7,11,13,17,19,23,29,31,37,41,43,47,53,59,61,67,71,73,79,83,89,97 1 నుండి 50 వరకు గల ప్రధానసంఖ్యలు .... 15 1 నుండి 100 వరకు గల సంయుక్త సంఖ్యలు …. 74

Comments