సాపేక్ష ప్రధాన సంఖ్యలు ( పరస్పర ప్రధాన సంఖ్యలు )

సాపేక్ష ప్రధాన సంఖ్యలు ( పరస్పర ప్రధాన సంఖ్యలు ) :- రెండు సంఖ్యలకు ‘ 1’ తప్ప వేరే సామాన్య కారణాంకాలు ఏవి లేనట్లయితే అట్టి సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు ( పరస్పర ప్రధాన సంఖ్యలు ) అంటారు ఏవేని రెండు సంఖ్యల గ. స. భా 1 అయిన అట్టి సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు ( పరస్పర ప్రధాన సంఖ్యలు ) అంటారు ఉదా : (5,7 ) (10,3), (7,9) ఏవేని రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయినంత మాత్రాన అవి ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు . కాని రెండు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అయిన అవి పరస్పర ప్రధాన సంఖ్యలు అగును. రెండు సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అయినప్పుడు కూడా అవి పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యే అవకాశం ఉంది ఉదా 4, 15 లు సంయుక్త సంఖ్యలు వాటి ఉమ్మడి కారణాంకం 1 కావున అవి పరస్పర ప్రధాన సంఖ్యలు

Comments