సమితులు రాయాడం sets write


సమితిని ఆంగ్ల వర్ణమాలలోని పెద్ద అక్షరాలు A, B, C, D, ..చే 

సూచిస్తారు

ఉదా :   సహజ సంఖ్య సమితి     N={1, 2, 3, …}

ఉదా :  పూర్ణ  సంఖ్యల  సమితి      Z={…., -3, -2, -1, 0, 1, 2, 3, …}

సమితిలోని  మూలకాలను  ఆంగ్ల వర్ణమాలలోని చిన్న  

అక్షరాల   a, b, c, d,..చే సూచిస్తారు

        V= { a, e, i, o, u }

సమితి వాదాన్ని అభివృద్ది పరిచిన శాస్రవేత్త  జార్జికాంటర్

ఒక సముదాయంలో ఏదైని వస్తువు ( మూలకము ) ఒకటి కంటే ఎక్కువ 

సార్లు వస్తే అట్టి వస్తువును ఒకేసారి గణించవలెను

SCHOOL  అనే పదములో "O" అక్షరము రెండు సార్లు వచ్చినది

దానిని సమితిలో చెప్పాలంటే {S, C, H, O, L}   అగును  


SUCCESS  అనే పదములో " S"   అక్షరము మూడు సార్లు ,

 C  ′ అక్షరము రెండు   సార్లువచ్చినది

దానిని సమితిలో చెప్పాలంటే {S, U, C, E}   అగును   
  

10 కంటే తక్కువైన బేసిసంఖ్యలు కలిగిన సమితి 
                             A=   {1,3 , 5, 7, 9}


F అనేది 25  మరియు 60 మధ్య గల 5 యొక్క గుణిజాల సమితి 
                                   F=   { 30, 35, 40, 45, 50, 55}
సరి ప్రధానంకాల సమితి                  C=   {2}
మొదటి 5 ఘన సంఖ్యల సమితి            
                                     G=   {1, 8, 27, 64, 125}
రామానుజన్ సంఖ్యలోని అంకెల సమితి   రామానుజన్ సంఖ్య 1729                         G=   {1, 7, 2, 9}

Comments

Post a Comment