వర్గమూలాలు , ఘనమూలాలు ఒక సంఖ్యను రెండు సమాన కారణాంకాల లబ్ధంగా వ్రాయవీలయితే ఆ సంఖ్యను పరి పూర్ణ వర్గ సంఖ్య అంటారు ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణించగా వచ్చు లబ్దంను ఆ సంఖ్యకు వర్గం అంటారు. ఖచ్చిత వర్గము :- ఒక అకరణీయ సంఖ్య మరొక ఆకరణీయ సంఖ్య వర్గానికి సమానం . వర్గ సంఖ్యలు :- ఒక పూర్ణ సంఖ్య మరొక పూర్ణ సంఖ్య వర్గానికి సమానం . ఉదా : అందుచే అన్ని వర్గ సంఖ్యలు ఖచ్చిత వర్గాలే కాని అన్ని ఖచ్చిత వర్గాలు వర్గ సంఖ్యలు కావు. చతురస్ర నమూనలో చూపించగలిగే సంఖ్యలను వర్గ సంఖ్యలు అంటారు