🔶 ఉదయాన్నే చదివితే మంచిదా ? లేదంటే రాత్రిపూటా.. ఇది తేల్చుకోలేక సతమతమవుతున్నవారెందరో! ఇంతకీ , ఏ టైంలో చదివితే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయో తెలిపే కొన్ని చిట్కాలివిగో.. 🍥 Study Time | ఉదయాన్నే చదవడం ( Study) మంచిదా ? లేదంటే రాత్రుళ్లా ? పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరిలో కలిగే సందేహం ఇదే! ఏ టైంలో చదివితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చో తేల్చుకోలేక సతమతమవుతున్నవారెందరో! ఇంతకీ , ఏ టైంలో చదివితే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయో గుర్తించే కొన్ని చిట్కాలివిగో.. ➡️ ఏదైనా చదివే ( Study) విషయంలో అందరికీ ఒకే సమయం నప్పదు. ఒక్కొక్కరి వ్యక్తిగత అంశాలు , ప్రాధాన్యతలు ఒక్కోలా ఉంటాయి. అందువల్ల చదివేందుకు ఉదయం మంచిదా ? రాత్రుళ్లా అనేది ఆయా వ్యక్తుల అనుకూల సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. పఠనానికి ( Reading) ఫలానా సమయమే ఉత్తమమని ఏమీ చెప్పలేం. ఎప్పుడు క్రియేటివ్ గా , ఏకాగ్రతగా ఉంటారో గుర్తించి ఎవరికి నప్పే సమయాన్ని బట్టి వారు తమ చదువును కొనసాగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ➡️ ప్రశాంతమైన , నిశ్శబ్ద వాతావరణాన్ని ఇష్టపడేవారికి పగటి పూటతో పోలిస్తే ర...